epaper
Friday, April 3, 2026
epaper

కాళేశ్వరంపై దుష్ప్ర‌చారం

కాళేశ్వరంపై దుష్ప్ర‌చారం
బ్యారేల అంశం మొత్తం ప్రాజెక్టులో చిన్న భాగ‌మే
మొత్తం ప్రాజెక్టుపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది
ఐదు వందల కోట్లతోనే మరమ్మతులు సాధ్యం
ప్రాణహిత జలాల వినియోగంలో ప్రభుత్వం విఫ‌లం
కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌లు అవ‌గాహ‌న లేమితోనే
జీవనాడి కాళేశ్వరం… నిర్లక్ష్యం రాష్ట్రానికే ప్రమాదకరం
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్ర‌చారం జరుగుతోంద‌ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి చేసిన “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అన్న వ్యాఖ్యలు అవగాహన లోపంతో చేసినవేనని పేర్కొంటూ, ఇవి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. జగిత్యాలలో తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్‌లో చిన్న భాగమేనని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న సమస్యలను మొత్తం కాళేశ్వరం వ్యవస్థపై మోపడం రాజకీయ ఉద్దేశంతోనే జరుగుతోందని ఆరోపించారు. నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా అన్నది పక్కన పెడితే, బ్యారేజీల పిల్లర్లు కుంగి రెండేళ్లు గడిచినా పునరుద్ధరణ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందన్న ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేదేనని, కేవలం ఐదు వందల కోట్లతో పనులు పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు. సంబంధిత భద్రతా సంస్థ నివేదిక వచ్చినా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమన్నారు.

జీవనాడి కాళేశ్వరం… నిర్లక్ష్యం రాష్ట్రానికే ప్రమాదం

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాడిగా నిలిచిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలతో పాటు హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, ముసి శుద్ధీకరణ కూడా ఈ ప్రాజెక్ట్‌పైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. ప్రాణహిత జలాలను వినియోగించడంలో ప్రభుత్వం కనీస ప్రణాళికలు కూడా రూపొందించలేదని విమర్శించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణ ఆలస్యం అయితే దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాల సాగు భూములు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వంలో మార్పు రావాలి

ప్రస్తుత ప్రభుత్వం విమర్శలకే పరిమితమై చర్యల్లో విఫలమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ప్రజల ఆస్తులని, వాటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ పనులు చేయకపోతే ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా స్పందిస్తూ గతంలో “మార్పు రావాలి.. కేసీఆర్ పోవాలి” అన్న నినాదంతో ప్రజలు మార్పు తీసుకువచ్చారని, ఇప్పుడు రెండేళ్లలోనే “మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలి” అనే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ప్రాణహిత జలాల వినియోగంలో వైఫల్యం, ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రస్తుత పాలన వైఖరిని ప్రతిబింబిస్తోందని తీవ్రంగా విమర్శించారు. తాను భవిష్యత్తులో తీసుకునే రాజకీయ నిర్ణయాలు ప్రజల అభిప్రాయాల మేరకే ఉంటాయని పేర్కొంటూ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి

కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి మహనీయుల ఆశయాలు అందరూ ఆచరించాలి బీసీ సంక్షేమ...

సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు

సంబోజు శేఖర్ మృతి పత్రికా రంగానికి తీరని లోటు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు...

ప‌శువుల‌పై హైనా దాడి

ప‌శువుల‌పై హైనా దాడి మూడు లేగదూడలు, రెండు మేకలు మృతి కాకతీయ,చిగురుమామిడి : హైనా...

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా డాక్ట‌ర్ జేఏసీ ఆందోళ‌న‌

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా డాక్ట‌ర్ జేఏసీ ఆందోళ‌న‌ కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్...

ఎన్‌సి‌సి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

ఎన్‌సి‌సి ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం కాకతీయ, జమ్మికుంట : ఎన్‌సి‌సి ద్వారా క్రమశిక్షణ...

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా హుజురాబాద్ బంద్ వ్యాపారులు, ప్రజల స్వచ్ఛంద మద్దతు… పూర్తి...

కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కాకతీయ, పెద్దపల్లి రూరల్ : ముత్తారం గ్రామ...

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఇద్దరు యువకులు మృతి కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img