చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
* సీఐ రమేష్ నాయక్
కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ అన్నారు.శుక్రవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని వీరభద్ర కళామందిర్ సమీపంలో పవనసుత భజన మండలి సంఘ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన పవనసుత సంఘ సభ్యులను అభినందిస్తున్నట్లు చెప్పారు.వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రజలు ప్రయాణికులు,దప్పిక తీర్చుకో వడానికి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పవనసుత భజన మండలి సంఘ సభ్యుల తో పాటు వర్తక,వాణిజ్య, వ్యాపార సంఘాల, నాయకులు పాల్గొన్నారు


