నా పేరు చెప్పి అక్రమాలు చేస్తే ఫిర్యాదు చేయండి
కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తన పేరు చెప్పుకుని ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ఇటువంటి వ్యవహారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తన పేరు ఉపయోగిస్తూ పంచాయతీలు, సెటిల్‌మెంట్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా పైరవీకారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, అదే సమయంలో అక్రమాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇకపై తన పేరు చెబుతూ ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వెంటనే ఎంపీ కార్యాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సూచించారు.


