epaper
Friday, April 3, 2026
epaper

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం
99 రోజుల ప్రణాళికతో ప్ర‌భుత్వం ముందుకు
ఇంటింటికీ సంక్షేమ పథకాల అమలు ల‌క్ష్యం
గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు
కొత్త పథకాలతో కుటుంబాలకు భరోసా
భ‌ద్రాచ‌లం ఐటీడీఏ పీవో రాహుల్

కాకతీయ, మణుగూరు టౌన్ : ప్రభుత్వం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తోందని భ‌ద్రాచ‌లం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా పని చేసి ప్రజలకు మౌలిక వసతులు అందించాలని సూచించారు. గురువారం మణుగూరు మండలంలో పర్యటించిన ఆయన మున్సిపాలిటీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను సేకరించి తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చాలా కుటుంబాలు వినియోగించుకున్నాయని పేర్కొన్నారు.

గిరిజన మహిళలకు ఉపాధి

చెర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో గిరిజన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు, బర్ఫీలు తయారు చేసేలా ప్రోత్సహించామని తెలిపారు. మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడిన వారికి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో వారు తమ ఉత్పత్తులను కరీంనగర్, వరంగల్, సూర్యాపేట ప్రాంతాల్లో విక్రయించి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. దేవాలయం ప్రాంగణం, ట్రైబల్ మ్యూజియం, ఐటిడిఏ కార్యాలయంలో అమ్మకాల సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళలు ఆన్లైన్ ద్వారా కూడా వ్యాపారం విస్తరించారని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల విస్తరణ

రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణించినా ఆర్థిక భరోసా అందేలా ఈ పథకం ఉండబోతుందని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల నుంచి విస్తరించి ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అల్పాహారం, భోజనం అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలు అందించే కార్యక్రమం కూడా త్వరలో అమలులోకి వస్తుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు సహజ పద్ధతుల్లో పంటలు పండించేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామసభలో ప్రజలు చెప్పిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని, త్వరలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, విద్యుత్ శాఖ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, సర్వేశ్వరరావు, జిపిఓ లక్ష్మణ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం

త్యాగమే ప్రేమకు ప్రతీక... గుడ్ ఫ్రైడే సందేశం వేల మందితో ఖమ్మం పట్టణంలో...

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం స్థానిక...

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత భర్త అవయాలు దానం కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం...

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కొత్తగూడెం మేయర్...

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ వార్డు...

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం కాకతీయ, ఖమ్మం : రక్తదానం చేయడం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img