కాకతీయ, గీసుగొండ: గణేష్ నిమజ్జనంలో తహసీల్దార్ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని ఎం.డి.రియాజుద్దీన్ అధికారులతో అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 21 గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15,16వ డివిజన్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుండి నిమజ్జన ప్రదేశాల వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిమజ్జన ప్రదేశాల్లో పంచాయితీ కార్యదర్శులు,రెవెన్యూ, మెడికల్, పోలీసు సిబ్బందిస సమన్వయంతో పనిచేసి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. మండలంలో మొత్తం 180 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. నిమజ్జన ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు, పారిశుధ్య పనులు చేయడంతో పాటు చెరువుల వద్ద ముళ్ల చెట్లను తొలగించాలని సూచించారు.
ఒకే ప్రదేశంలో ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేసే సందర్భంలో సమయాన్ని కేటాయించి బారికేడ్లు ఏర్పాటు చేయాలని,గజ ఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ పాక శ్రీనివాస్,సిఐ ఎ.మహేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణార్జున్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సాంబయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


