హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
* కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు
కాకతీయ,చేర్యాల:చేర్యాల మండల కేంద్రంలోని కళ్యాణి గార్డెన్ లో ఈ నేల 20వ తేదీన జరగబోయే హిందూ సమ్మేళనంలో భాగంగా కార్యక్రమం కరపత్రాలను కమిటీ అధ్యక్షులు బాశెట్టి బుచ్చి రాములు ఆధ్వర్యంలో గురువారం అభయాంజనేయ స్వామి ఆలయంలో కమిటీ సభ్యులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు మాట్లాడుతూ. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతులు డాక్టర్ ఆదిత్య పరాశ్రీ రానున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంజనేయస్వామి మాలాధారణ స్వాములకు చేర్యాల అయ్యప్ప స్వామి ఆలయంలో బిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.కరపత్రాల ఆవిష్కరణలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


