epaper
Friday, April 3, 2026
epaper

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌
వెలుగుమ‌ట్ల ఘ‌ట‌న‌లో మోసాల‌కు ముఠాకు షాక్‌
నిందితుల స్తిర‌, చ‌ర ఆస్తుల గుర్తింపుపై పోలీస్‌శాఖ ఫోక‌స్‌
45ల‌క్ష‌ల విలువ చేసే ఐదు వాహ‌నాలు స్వాధీనం
1549 మంది పేద‌ల నుంచి రూ.2.5కోట్ల‌కు పైగా వ‌సూళ్లు
ఏడుగురు ప్ర‌ధాన నిందితుల నుంచి స‌మాచారం సేక‌ర‌ణ‌

కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూదాన్, ప్రభుత్వ భూముల‌ను పేద‌ల‌కు ఆశ‌గా చూపి దందాలు సాగించిన వారిపై పోలీస్ శాఖ సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకుంటోంది. పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడబెట్టుకున్న వారిని ఇప్ప‌టికే గుర్తించి కేసులు న‌మోదు చేసిన ఖ‌మ్మం పోలీసులు..ఇప్పుడు వారి ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిందితుల నుంచి 10 లక్షలకు పైగా విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తూ భారీగా వసూళ్లు చేసిన ము|ఠాపై కేసులు నమోదు అయ్యాయి. ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ సహా ఇతర స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. విచారణలో బల్లి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య అలియాస్ కృష్ణ, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి తదితరులను కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో సుమారు 1549 మంది బాధితుల నుంచి రూ.2,88,38,100 వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. ఆ డబ్బులో కొంత భాగాన్ని కోర్టు ఖర్చులు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలిక సౌకర్యాల పేరుతో ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు, స్థిర ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు వెల్లడైంది.

ఆస్తుల గుట్టు విప్పిన విచారణ

తాళ్లూరి కృష్ణ ఏపీ 20 టి ఏ 1363 నంబర్ ట్రాక్టర్ కొనుగోలు చేయడంతో పాటు కవిరాజ్ నగర్ రోడ్డు నెంబర్ 1లో 64.54 గజాల విస్తీర్ణంలో ఇంటిపై 19 లక్షల 90 వేల రూపాయలు వెచ్చించి రెండు అంతస్తులు నిర్మించినట్లు తెలిసింది. బాణాల లక్ష్మణాచారి టిఎస్ 05 ఈఆర్ 1100 నంబర్ హీరో డీలక్స్ మోటార్ సైకిల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పోలెబోయిన ముత్తయ్య టిఎస్ 28 టి 2868 నంబర్ టాటా మ్యాజిక్, టిఎస్ 04 యూఈ 6290 నంబర్ టాటా ఇంట్రా వాహనాలను వినియోగించినట్లు బయటపడింది. కొప్పెర వెంకన్న టిఎస్ 29 బి 8489 నంబర్ స్ప్లెండర్ మోటార్ సైకిల్‌తో పాటు 10 లక్షల విలువ గల ఇంటి స్థలం కొనుగోలు చేసి, తన కుమారుడి చదువులకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది. చిప్పలపల్లి వీరయ్య 4 లక్షల 48 వేల 744 రూపాయల నగదును, మరో 10 లక్షల రూపాయలను ఎన్కూరుకు చెందిన వ్యక్తి వద్ద ఉంచినట్లు గుర్తించారు.

ఆస్తుల అటాచ్మెంట్‌కు సన్నాహాలు

నిందితుల వద్ద ఉన్న మొత్తం స్థిర, చర ఆస్తుల విలువ సుమారు 44 లక్షల 78 వేల 744 రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో ఐదు వాహనాలు 10 లక్షల 40 వేల రూపాయలు, ఇల్లు 19 లక్షల 90 వేల రూపాయలు, ఇంటి స్థలం 10 లక్షలు, బ్యాంక్ ఖాతాల్లో 4 లక్షల 48 వేల 744 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కస్టడీ విచారణ అనంతరం నిందితులను న్యాయస్థానానికి హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. భూదాన్, ప్రభుత్వ భూముల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం

చంద్ర రథోత్సవానికి సిద్ధం ఇల్లందకుంట దేవస్థానం భక్తుల రాకకు విస్తృత ఏర్పాట్లు అలయ కమిటీ...

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు

గుట్టనుంచి అక్రమ మట్టి తవ్వకాలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతి రావు కాకతీయ,కారేపల్లి...

త్యాగమే ప్రేమకు ప్రతీక… గుడ్ ఫ్రైడే సందేశం

త్యాగమే ప్రేమకు ప్రతీక... గుడ్ ఫ్రైడే సందేశం వేల మందితో ఖమ్మం పట్టణంలో...

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి

దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తి కావాలి సామాజిక న్యాయం కోసం పోరాటం ఆదర్శం స్థానిక...

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత

దుఃఖంలోనూ మహిళ జర్నలిస్టు మానవత భర్త అవయాలు దానం కాకతీయ ,ఖమ్మం: భర్త ఇక...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం...

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి

గిరిజన బిడ్డలు కార్పొరేట్ రంగంలో ఎదగాలి యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కొత్తగూడెం మేయర్...

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img