రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
* విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని వ్యక్తం చేసిన గ్రామస్తులు
కాకతీయ,చేర్యాల : ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని విద్యార్థిని మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే చేర్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ ఢీ కొనగా ఆకునూర్ గ్రామానికి చెందిన కడుదూరి కీర్తన ఆమె తాత బాలయ్యకు గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన ఇంటర్ చదువుతున్న విద్యార్థి కీర్తన (18)ను హుటాహుటిన అంబులెన్స్ లో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆకునూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థి కీర్తన మృతి పట్ల ఆకునూరు సంతాపం
కీర్తన మృతి పట్ల ఆకునూరు గ్రామ సర్పంచ్ కొమ్మురవి, గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు కలిసి గురువారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద జరిగిన గ్రామ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించిన వారిలో పంచాయతీ కార్యదర్శి ఎండి కరీం, ఉప సర్పంచ్ కడారి పల్లవి భాస్కర్, వార్డు సభ్యులు నూనె శేఖర్, అందె లక్ష్మీ, సూర అనిత, జూపల్లి కార్తీక్ రెడ్డి, తాటికొండ శేఖర్ యాదవ్, ఎండి హైమద్, భూమని భాస్కర్, గణపురం బాలనరసమ్మ, సుంచు హేమ, మంతపురి భాగ్యలక్ష్మి, స్వర్గం రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


