ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనేదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం..
*ప్రజలు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
*కొనాయిమాకుల గ్రామసభలో కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి
కాకతీయ, గీసుగొండ: ప్రజా ప్రభుత్వంలో ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొనాయిమాకులలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామ సర్పంచి వజ్ర రాజు,మండల ప్రత్యేక అధికారి సురేష్ తహసిల్దార్ రియాజుద్దీన్,ఎంపీఓ పాక శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఇనుగాల మాట్లాడుతూ.. గ్రామ సభలు ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యవేదికగా నిలుస్తాయని,ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమ వుతుందని తెలిపారు.రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు,గృహ జ్యోతి,పెన్షన్లు,గ్యాస్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలపై చర్చించి లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా,ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం,దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ వంటి పథకాలపై వివరించారు.

గ్రామంలో పారిశుద్ధ్యం,చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి,పల్లె దవాఖానా ల్లో వైద్య సేవలు, రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా,యువతకు ఉపాధి అవకాశాలు, డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు,ఎడీఈ రవి, ఏపీఎం ఈశ్వర్,పంచాయతీ కార్యదర్శి ఆనంద్,ఉప సర్పంచ్ పి.రాజేశ్వరరావు, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు రైతులు స్వయం సహాయక సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదేవిధంగా మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించినట్లు ఎంపీఓ పాక శ్రీనివాస్ తెలిపారు.


