కాకతీయ ఇనుగుర్తి : బీసీ కులాల్లో అత్యధిక జనాభా యాదవులే కాబట్టి మే మెంతో మాకంత రిజర్వేషన్లు ఇవ్వాలని టీపీసీసీ ఓబీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం చిన్న బస్టాండ్ సెంటర్లో యాదవులతో కలిసి వీరన్న యాదవ్ గొల్ల కురుమల సదస్సు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్లో జరిగే గొల్ల కురుమ యాదవ సదస్సు కు యాదవులంతా సంకటితమై పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. యాదవ జాతి రాజకీయంగా, యువత విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎదగాలంటే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లలో మేమెంతో మాకంత అనే నినాదంతో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా పోరాడాలన్నారు.
కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు చిన్నాల కట్టయ్య, దొండ శ్రీను, పూజారి కొమురయ్య, కొట్టం యాకమూర్తి, వల్లముల మురళీ, గట్టిగొర్ల వెంకన్న, సోమయ్య, రవి, సంతోష్, దేవేందర్ పాల్గొన్నారు.


