స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం
ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక
కాకతీయ, ఖిలావరంగల్: స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దని మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. చింతల్ ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ పదవికి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులను పక్కనపెట్టి ఇతరులకు టికెట్ ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ఒకసారి మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితో రాజీకి వచ్చినట్లు తెలిపారు. ఇకపై అలాంటి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. స్థానిక నాయకులకు న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. టికెట్ల కేటాయింపులో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షర్పొద్దీన్, నీలం సుధాకర్, ఫీరోజ్, ఖాజు, ఇక్కబల్, నాంపెల్లి మధు, మైదం నరేష్, గణేష్, రాజ్‌కుమార్, ముజు, నవీన్, రవి, మధుకర్, ఐలయ్య, అబ్బు, అంకుష్, రెహానా తదితరులు పాల్గొన్నారు.


