హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కలిగి ఉండాలి
అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ అభినందనీయం
మంత్రి దామోదర రాజనర్సింహ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుండి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ వ్యాక్సిన్ ను 9 నుండి 14 సంవత్సరాల వయసు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు.


