కాకతీయ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా పనిచేసిన బి.శంకర్ పదోన్నతిపై ఇటీవల మేడ్చల్ జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో విజయ్ భాస్కర్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెల్లిన శంకర్ ను, నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విజయభాస్కర్ ను గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలారపు పర్వతాలు యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాత రాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్ యాదవ్, పెద్దపల్లి మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యాదవ్, ధర్మారం మండల అధ్యక్షులు, జంగ మహేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


