epaper
Wednesday, April 1, 2026
epaper

అకాల వర్షంతో పంట‌ల‌కు దెబ్బ

అకాల వర్షంతో పంట‌ల‌కు దెబ్బ
న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి

కాకతీయ, జగిత్యాల : జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో కోత దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.
సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి, పెంబట్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన, లక్ష్మీదేవిపల్లిలో రైతు రవి నాయక్‌కు చెందిన బీరకాయ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో మాట్లాడిన జీవన్‌రెడ్డి, జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉండగా అకాల వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంటలు నేలకొరిగాయని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ ద్వారా నష్టం అంచనా వేయించి చర్యలు చేపట్టాలని కోరారు. మొక్కజొన్న, నువ్వులు, కూరగాయల పంటలు, మామిడి తోటలు పూర్తిగా దెబ్బతినడంతో ఎకరాకు రూ.20–30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారని పేర్కొన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.1800–1900 మాత్రమే ఉండటంతో ప్రతి క్వింటాల్‌కు సుమారు రూ.500 వరకు నష్టం వస్తోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. మార్క్‌ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని, లేకపోతే దళారులు లాభపడతారని హెచ్చరించారు. పంటల బీమా అమలు లేక రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, తక్షణమే సర్వేలు చేసి కనీసం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని కోరారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్...

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన అంబేద్కర్ కూడలిలో ధర్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం ప్రైవేట్...

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆందోళనలకు...

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం

కరీంనగర్‌లో చికెన్ సెంటర్లు బంద్‌కు దూరం.. కాకతీయ, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాప్...

కొండగట్టు లో అపశృతి

కొండగట్టు లో అపశృతి చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు కాకతీయ, కొండగట్టు :...

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజా పాలన బలోపేతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జూన్ 2 నుంచి...

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లిలో ఫుడ్ ఫెస్టివల్ వైభవం సాంస్కృతిక కార్యక్రమాలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img