గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
బోనాలు, ప్రతిష్ఠతో కోనాపురం ఉత్సవమయం
కాకతీయ, చేన్నారావుపేట : గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుక గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


