ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
కాకతీయ, పెద్దవంగర :ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ తెలిపారు. గొట్టిపర్తి, పోచారం గ్రామ శివారు అకేరు వాగు నుంచి మంగళవారం ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లతో కలిసి రెండు ట్రాక్టర్ లను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని పెద్దవంగర పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ బానోత్ యాకు, బానోత్ గోపాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


