మహిళలు స్వయం ఉపాధి పొందాలి
* షాపివో ఏరియా మేనేజర్ సౌజన్య
కాకతీయ, చేర్యాల: మహిళలు స్వయం ఉపాధి పొందాలని షాపివో ఏరియా మేనేజర్ మావురపు సౌజన్య అన్నారు. మంగళవారం కాశేగూడెం గ్రామంలోని కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆసియా బేగం–అఖిల్,ఏరియా మేనేజర్ సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ రహీమ్, షాపివో సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ గద్దేవార్ వంశీ, గొల్లపల్లి రజిత,షేక్ కమల్, శిక్షకురాలు షబానా తో పాటు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


