కాకతీయ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఇంచార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ వి. వాణిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో హన్మకొండ నుంచి పదోన్నతి పై వచ్చిన డాక్టర్ కె విజయభాస్కర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధికారులు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాద పూర్వకంగా కలిశారు.


