అన్నదాతకు ఆధునిక ఆసరా…!
రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ,రాయపర్తి : సాంకేతికతను సాగుకు జోడించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వం అందజేసిన రాయితీపై మంజూరైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు.ఈ నేపథ్యంలో రూ.17 లక్షలు విలువైన గడ్డి కట్టె యంత్రాలు,రోటావేటర్లు,బ్రష్ కట్టర్,పవర్ స్ప్రేయర్లు,బ్యాటరీ స్ప్రేయర్లు వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక యంత్రాలు అన్నదాతకు ఒక గొప్ప ఆసరాగా నిలుస్తాయని స్పష్టం చేసారు.ఈ రోజుల్లో రైతులు వ్యవసాయం చేయడానికి కూలీల కొరతతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ప్రతి రైతు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కావద్దని,ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని సూచించారు.రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
** చెక్కులు పంపిణీ…
సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హామీ ఇచ్చారు.మండల పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 48,05,568 లక్షలు విలువైన కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేసారు.నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే తల్లిదండ్రులు అప్పుల పాలు కావాల్సి వచ్చేది.కానీ నేడు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో వారు ధైర్యంగా ఉంటుంన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దారు ముల్కనూరి శ్రీనివాస్,మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం,సర్పంచులు,ఏఈఓలు,రైతులు,మహిళాసంఘలు,నాయకులు,పాల్గొన్నారు.



