వేగం కాదు..ప్రాణమే మిన్న
డ్రైవింగ్‌లో నియంత్ర పాటించాలి
తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు
కాకతీయ, తుంగతుర్తి : డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తూ నిదానంగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. తుంగతుర్తి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు, వాహనదారులకు హెల్మెట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలు, పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు రహదారి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతి, స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


