హనుమద్గిరిలో మాలాధారణ సందడి
150 మంది భక్తుల దీక్ష
దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం
కాకతీయ, హనుమకొండ : హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. పద్మాక్షి దేవాలయం రోడ్డులోని ఆలయంలో ఆదివారం కార్యక్రమం జరిగింది. దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది భక్తులు మాలాధారణ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. మండల దీక్ష 40 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భిక్ష పొందదలచిన భక్తులు ఉదయం హారతికి హాజరై టోకెన్ పొందాలని సూచించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భిక్షకు హాజరుకావాలని తెలిపారు.
కార్యక్రమంలో అన్నదాన కమిటీ అధ్యక్షుడు గందె కృష్ణ పాల్గొన్నారు. కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్ హాజరయ్యారు. మాదాసు మొగిలయ్య, నరేందర్, గండ్రతి సుధాకర్, వంశీ, గుండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


