మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతం
వందల మందికి లబ్ధి
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు
కాకతీయ, ఖమ్మం : గాంధీ చౌక్‌లో నిర్వహించిన ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. వందలాది మంది ప్రజలు శిబిరాన్ని వినియోగించుకున్నారు. వాసవి క్లబ్ ఖమ్మం, వాసవి క్లబ్ గాంధీ చౌక్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. శ్రీకర హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు సేవలు అందించారు.

కార్యక్రమానికి వి ఎన్ కొత్త వెంకటేశ్వర్ రావు, పసుమర్తి రామ్మోహన్ రావు, వేములపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డా. రాకేష్ కొమురవెల్లి, డా. భరత్ రెడ్డి కట్ట, డా. అన్వేష్ గౌడ్ సి హెచ్ పాల్గొన్నారు. మోకాలి, తుంటి నొప్పులు, కీళ్ల సమస్యలపై ఉచిత వైద్య సేవలు అందించారు. సుమారు 500 మంది శిబిరంలో పాల్గొన్నారు. బి ఎం డి పరీక్షలు, మందులు ఉచితంగా అందించారు. ప్రతి ఒక్కరికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పసుమర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వెచ్చ కృష్ణ మోహన్, బూర్గుల యశ్వంత్ రాజీవ్ హాజరయ్యారు. బోనగిరి సురేఖ, వేముల లత, ధన్నారపు లక్ష్మి భవాని, వెచ్చ వీణ, అర్వపల్లి నిరంజన్, కురువెళ్ళ జగన్, గుంటుపల్లి దివాకర్ గుప్తా, వెచ్చ హరిబాబు, దాస శ్రీనివాసరావు, బుర్ల పుల్లారావు, ఆకుల సతీష్, కాజా వెంకటేశ్వర్లు, కాకరపర్తి సూర్యం, గన్నారపు నాగేశ్వరరావు, కొంకి మల్ల మృత్యుంజయరావు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


