టిప్పర్ ఢీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం.. ములుగు ఆసుపత్రికి తరలింపు
కాకతీయ, నూగూరు వెంకటాపురం : వేగంగా వచ్చిన టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం పాలెం గ్రామం వద్ద జరిగింది.
బైక్‌పై ప్రయాణిస్తున్న విష్ణు, అశోక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముకునూరు పాలెం గ్రామానికి చెందినవారని తెలిసింది. స్థానికులు వెంటనే స్పందించారు. గాయపడిన వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


