భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం
కాకతీయ, కరీంనగర్/భగత్ నగర్ : కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ హెలిప్యాడ్ గ్రౌండ్‌లో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సునీల్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో భగత్ నగర్ ప్రాంతీయులు, మహిళలు, యువకులు, చైతన్య యూత్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


