epaper
Saturday, March 28, 2026
epaper

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు

రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు

మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆగ్రహం…

కాకతీయ,చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలంలో తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి అనుచరుడిగా వ్యవహరిస్తున్న సూదిని అజయ్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం మండలంలో వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు పనులపై తన పెత్తనం కొనసాగించేందుకు కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్డి సమాజానికి చెందిన కొందరు నాయకులను ముందుకు తెచ్చి, వారిని ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
తనపై కేసులు నమోదు చేయించేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపిస్తూ, ఏసీపీ రవీందర్ రెడ్డి, ఎస్సై రాజేష్ రెడ్డి పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

క్వార్టర్ గొడవ ను అడ్డుపెట్టుకుని కేసులు…

నెల రోజుల క్రితం జల్లి గ్రామంలో జరిగిన చిన్నపాటి గొడవను ఆధారంగా చేసుకుని తనను ఇరికించారని అశోక్ యాదవ్ తెలిపారు. సంఘటన జరిగిన రోజు, అలాగే విచారణ సమయంలో తాను గ్రామంలో లేనని స్పష్టం చేశారు. బాధితులు నిరసన తెలిపిన సమయంలో కూడా తాను మండల పరిధిలో లేనని చెప్పారు. సంబంధం లేని తనను కేసుల్లో చేర్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
సూదిని అజయ్ రెడ్డి అక్రమ ప్రయోజనాల కోసం ఎవరికైనా తప్పుడు ఆరోపణలు చేయగలడని, అవసరమైతే సొంత వారినే దూరం చేసుకునే స్థాయిలో వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జల్లి గ్రామంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి అజయ్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తనపై నమోదైన అక్రమ కేసులను రద్దు చేయాలని ఆయన కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై ప్రమోద్ కుమార్ కాకతీయ, పెద్దవంగర :ఉచిత...

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం

దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం.. ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన...

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. *బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ డా....

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి కాకతీయ, పెద్దవంగర : పాడి...

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం

నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం 11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు.... కాకతీయ, నెక్కొండ: మండల...

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి

మూడేళ్ల కుమారుడితో మృత్యువు ఒడిలో తల్లి మూడేళ్ల కుమారుడితో కలిసి కాలువలో దూకి...

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img