కాకతీయ, పరకాల : పరకాల మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కె. విజయ భాస్కర్ పశువైద్యాధికారిగా పదోన్నతిపై పెద్దపల్లి జిల్లాకు వెళ్ళిన సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల అధికారులు మాట్లాడారు.
డాక్టర్ వెంకటనారాయణ పని చేసిన 6 నెలల్లో మండలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాకచక్యంగా పరిపాలన సాగించారని కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివి అన్నారు. అనంతరం ఆయనను శాలువా, మెమెంటో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో నడికూడ మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్రీరాం, పశు సంవర్ధక శాఖ అసోషియేషన్ ప్రతినిధులు కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపీఓ ఇందిర, ఈసీ రజనీకాంత్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వెంకట లక్ష్మణ్, కార్యదర్శులు సుమలత, రిజ్వానా, శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్, టెక్నికల్ అసిస్టెంట్లు సుమలత, కుసుమ ఫీల్డ్ అసిస్టెంట్లు కోమల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


