కాకతీయ, ములుగు : జిల్లాలో సోమవారం విస్తారంగా వర్షపాతం నమోదైంది. మాన్యువల్ రైన్గేజ్ ఆధారంగా జిల్లా మొత్తం 437.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు. జిల్లా సగటు వర్షపాతం 48.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం వెంకటాపురం – 42.0 మి.మీ,ములుగు – 22.6 మి.మీ, గోవిందరావుపేట – 42.4 మి.మీ, తాడ్వాయి – 42.0, ఏటూరు నాగారం – 114.8, కన్నాయిగూడెం – 12.4,వాజేడు – 34.2, వెంకటాపురం (భద్రాచలం వైపు) – 54.2, మంగపేట – 72.6మి.మీ. గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో అత్యధిక వర్షపాతం ఏటూరునాగారం మండలంలో 114.8 మి.మీగా నమోదైంది. తర్వాత మంగపేట (72.6 మి.మీ), వెంకటాపురం (54.2 మి.మీ) స్థానాల్లో నిలిచాయి. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.


