ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి”
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : జాతీయ రహదారి 63 విస్తరణలో బాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో నిర్మించబోయే ఆర్మూర్,
చంద్రాపూర్ జాతీయ రహదారి 63 పనులను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.


