కాకతీయ, నేషనల్ డెస్క్: చెప్పుల్లో దూరిన ఓ రక్తపింజరి పాముపిల్ల కాటు వేయడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించిన బెంగళూరులో చోటుచేసుకుంది. టీసీఎస్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ అనేకల్ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో నివాసం ఉంటున్నారు. పనిమీద బయటకు వెళ్లేందుకు చెప్పులు వేసుకున్నారు. అందులో ఉన్న పాము పిల్ల అతని బొటనవేలుపై కాటేసింది. అతనికి స్పర్శ లేకపోవడంతో ఆ విషయం తెలియలేదు. కాటు వేసిన సుమారు 45 నిమిషాల పాటు పాము ఆ చెప్పులోనే ఉంది. చెప్పులను విడిచిన తర్వాత అందులో పాము ఉందని వాళ్లింటికి వచ్చిన ఓ కార్మికుడు గుర్తించి కుటుంబ సభ్యులు తెలిపాడు.
అప్పటికే అస్వస్థతకు గురైన ప్రకాశ్ నోట్లో నుంచి నురగ వచ్చింది ఆసుపత్రికి తరలించే లూపే అతను మరణించారు. ఆయనకు 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కాలి స్పర్శ పూర్తిగా పోవడంతో పాము కరిచిన విషయం కూడా తెలియలేదు. దీనిపై బన్నేరుఘట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


