పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి
*మున్సిపల్ కమిషనర్ నాగేందర్
కాకతీయ,చేర్యాల: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నులు విధిగా చెల్లిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. చేర్యాల పట్ణణంలో గురువారం సిబ్బందితో కలిసి పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగేందర్ మాట్లాడుతూ. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. మునిసిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా గృహ పన్ను, ఇతర పన్నులను సమయానికి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలు ఉన్న పన్నులను 2026 మార్చి 31 తేదీకి ముందు చెల్లించాలని ప్రజలను కోరారు. గడువు తేదీ తర్వాత చెల్లించే పన్నుల పై వడ్డీ విధిస్తారని, అదనపు భారాన్ని తప్పించుకోవడానికి గడువులోగా చెల్లించాలని లేని పక్షంలో మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం ఆస్తులు జప్తు చేయబడతాయని హెచ్చరించారు.


