ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి
బిల్లులు రాక దవాఖానలు మూతబడే పరిస్థితి
మేజర్ సర్జరీలకు ట్రీట్మెంట్ ఇవ్వడంలేదు
నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదు
అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానెల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, ఆ నిధులు విడుదల కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. రూ.5 లక్షలు నుండి రూ.10 లక్షలు పెంచడం వల్ల రెండున్నర సంవత్సరాలలో కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందాదన్నారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయాలని సూచించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్య శ్రీ కింద రూ.5 లక్షల నుండి రూ.15 లక్షల వరకు 607 మందికి డబ్బులు విడుదల చేశామని, కానీ మీరు 496 మందికే ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నోటీసులు ఇచ్చినా బిల్లులు రిలీజ్ కావడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న దవాఖానలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో.. ఎప్పటిలోగా చెల్లిస్తారో సదరు శాఖకు సంబంధించిన మంత్రి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


