పోలీసులపై విశ్వాసం పెంపొందించాలి
బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
కాకతీయ, సంగెం : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పోలీసు అధికారులు కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సంగెం పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు స్థానిక అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు.తరువాత స్టేషన్‌లోని రికార్డులు నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు,నిందితుల అరెస్టు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే స్టేషన్ పరిధిలోని గ్రామాలు, నేర పరిస్థితులు,రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలను ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ సిబ్బంది పనితీరు,బీట్ వ్యవస్థ,పెట్రోలింగ్ విధానం, రికార్డుల నిర్వహణపై సీపీ పలు సూచనలు చేశారు.ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఎసిపి వెంకటేష్, స్థానిక సీఐ,ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.


