epaper
Thursday, March 26, 2026
epaper

రేపు సీతారాముల కల్యాణం

రేపు సీతారాముల కల్యాణం
భ‌ద్రాద్రి ఆల‌యంలో స‌ర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
28 ప‌ట్టువ‌స్త్రాల‌తో ఆల‌యానికి రానున్న ముఖ్య‌మంత్రి
ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌
మూడు విడతల్లో రూ.586 కోట్ల పనులకు శంకుస్థాపన
మొదటి విడత పనులకు ఇప్పటికే రూ.351 కోట్లు విడుదల
శ్రీరామ న‌వ‌మి ఉత్స‌వాల‌కు సకల ఏర్పాటు చేశాం : జిల్లా కలెక్టర్ అంకిత్
భక్తులకు భద్రత వలయం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఏర్పాట్లు పూర్తి
: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

కాకతీయ, కొత్తగూడెం : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భ‌ద్రాచ‌లం రాముల‌వారి క‌ల్యాణానికి స‌ర్వం సిద్ధ‌మైంది. భద్రగిరి కొండపై వెలసిన శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని శుభకర మంగళ వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలతో సీత‌మ్మ‌తో శ్రీరాముడికి క‌ల్యాణం జ‌రిపించ‌నున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి.. 28వ తేదీన రాములోరి పట్టాభిషేకానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. శుభసిల్లిన వేదమంత్రాల సాక్షిగా ఆ దేవతమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ విశిష్టతను.. రెండు రోజులు జరిగే కార్యక్రమాలను ఒకేరోజు జరపటం విశిష్టమైన రోజు అని పురోహితులు చెప్పుకొస్తున్నారు.

మాస్టర్ ప్లాన్ పనులకు 28 న శంకుస్థాపన

దక్షిణ యోజన బాసిల్లుతున్న భద్రాద్రి రాముడు ఆలయానికి పునరుద్ధరణ పనులు చేపట్టడానికి దేవాలయం అభివృద్ధితో పాటు భద్రాచల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే తలమానికంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. చేపట్టే అభివృద్ధి పనులకు గాను మూడు విడతలుగా మంజూరయ్యే నిధులు మొత్తంరూ. 586 కోట్లు ప్రభుత్వ అంచనా వేసింది. కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం అమూల్యమైన ఘట్టాలను దృష్టిలో ఉంచుకొని మొదటి విడతగా రూ.380 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 2024 సంవత్సరం మే 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలాన్ని పర్యటించిన సందర్భంగా రామాలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పరిపాలన ఉత్తర్వుల మేరకు విడుదలైన రూ.380 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి, పట్టణాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కళ్యాణానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రజల అదృష్టం మేరకే తెలిపిన వెంటనే రూ.586 కోట్ల రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రత్యేక ఉత్తర్వులు జారీ : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

భద్రాచలం దేవస్థానము, పట్టణ అభివృద్ధి కోసం జీవో నెంబర్ ఆర్టీ 167 ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తూ మొదటి విడతగా రూ.381 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి హాజరవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, కళ్యాణానికి హాజరయ్యే కోట్లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు అత్యవసరంగా ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

అన్ని శాఖల సమన్వయం నియంత్రణ పరిపాలన : జిల్లా కలెక్టర్ అంకిత్

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం తదుపరి జరిగే పట్టాభిషేకానికి హాజరయ్యే వేలాది మంది భక్త జనసందోహానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించేందుకు ఇప్పటికే సమీక్ష నిర్వహించామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను మిథున స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలు, వేదికలు, భక్తులు కూర్చునేందుకు సకల సదుపాయాలు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్, వైద్య సదుపాయాలు, క్యూలైన్ పద్ధతి తదితర వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు కలెక్టర్ సౌరబ్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టామని తెలిపారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈవో దామోదర్ రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు.

భక్తులకు అడుగడుగున రక్షణ కవచం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 27, 28 తేదీలలో జరిగే శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యే వేలాది మంది భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున రక్షణ కవచంగా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధివిధానాలను క్షుణ్ణంగా తెలియజేసి సెక్టార్ల వారీగా ఇన్‌చార్జీలను నియమించి ట్రాఫిక్ నియంత్రణ, ప్రతిష్టాత్మక బందోబస్తు ప్రణాళికలతో ముందుకెళ్లామని, ఇందుకోసం పార్కింగ్ స్థలాలు, భారీ కేడ్లు, ప్రసాద కౌంటర్లు, సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది

సమస్య చిన్నదే.. నిర్లక్ష్యమే పెద్దది పైప్ లైన్ మరమ్మతుల్లో ఆలస్యం పై ప్రజల...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండలంలో...

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి

మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌గాలి అకాల వర్షాల...

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత

రామయ్య సేవలో పోతిరెడ్డికి కీలక బాధ్యత ఉత్సవ కమిటీలో స్థానం క‌ల్పించిన ప్ర‌భుత్వం భద్రాచలం...

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి

వరి, మొక్కజొన్న రైతులకు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి కాకతీయ,...

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

భద్రాద్రి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై నిర్లక్ష్యం రూ.560 కోట్లతో...

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు రేపు ప‌ట్ట‌ణానికి సీఎం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img