ప్రభుత్వ బడిలో రాజకీయ భజన
చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బర్త్ డే వేడుకలు
రాజకీయ దర్పం ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు
నేతలు చెప్పినట్లుగా నడుచుకున్న మహిళా టీచర్లు
క్లాసులకు బ్రేకు ఇచ్చి మరీ వేడుకల నిర్వహణ
కేరింతలు కొడుతూ నాయకులతో కలిసి టీచర్ల చప్పట్లు
ప్రభుత్వ విద్యాలయంలో నిబంధనలకు పాతర
ప్రభుత్వ బడిలో రాజకీయ భజన
చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బర్త్ డే వేడుకలు
రాజకీయ దర్పం ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు
నేతలు చెప్పినట్లుగా నడుచుకున్న మహిళా టీచర్లు
క్లాసులకు బ్రేకు ఇచ్చి మరీ వేడుకల నిర్వహణ pic.twitter.com/wa0QPVu9zb— Kiran Arelly (@ArellyKiran1988) March 26, 2026
కాకతీయ, నర్సంపేట : కుల,మతాలు, రాజకీయాలకు అతీతంగా కొనసాగాల్సిన విద్యాలయంలో రాజకీయ భజన.. దర్పం దర్శనమిచ్చింది. నర్సంపేట పాకాల రోడ్డులోని జ్యోతి బాపూలే బాలికల హాస్టల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమారుడు అవియుక్త్ రెడ్డి బర్త్ డే వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఉపాధ్యాయినులు ఈ వేడుకలను క్లాసులకు బ్రేక్ ఇచ్చి మరీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే వేడుకలు నిర్వహించడం గమనార్హం. తరగతులను మధ్యలోనే నిలిపివేసి వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబందనలకు పాతర వేసి ఇలా రాజకీయ నేతలు… పాఠశాలలోకి ప్రవేశించి వేడుకలు నిర్వహించడమేంటీ..? అందుకు పాఠశాల అధికారులు సహకరించడమేంటంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల విద్యను పక్కనబెట్టి రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


