సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థినుల ప్రతిభ
కాకతీయ, జమ్మికుంట : ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ సందడిగా సాగింది. విద్యార్థినులు ప్రదర్శించిన శాస్త్రీయ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించారు. విద్యార్థినుల ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొలుగూరి సురేష్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ హాజరయ్యారు. ఉపాధ్యాయులు, కందాల రాము, గడ్డం దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.


