మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేయాలి
సీపీఎం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన
కాకతీయ, చింతకాని : మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో బాబ్జి ప్రసాద్‌కు మెమోరాండం అందజేశారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు. మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు హాజరయ్యారు. సీనియర్ నాయకులు వత్సవాయి రాములు, మద్దిని బసవయ్య, రౌతు అప్పారావు పాల్గొన్నారు. మడుపల్లి కిరణ్, తోటకూరి వెంకట నరసయ్య, బల్లి వీరయ్య, గడ్డం కోటేశ్వరరావు, నక్కన బోయిన శాంతారావు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


