హైవే పనుల్లో గందరగోళం
గట్టుదుద్దెనపల్లిలో ఏరియాలో పనుల్లో నాణ్యత లేమి
సైడ్ డ్రైనేజీ నిర్మాణా కొలతల్లో భారీగా తేడాలు
వరద నీరు నిలిచే ప్రమాదముందని గ్రామస్థుల ఆందోళన
కాంట్రిబ్యూషన్ పేరుతో కొందరి నుంచి కాంట్రాక్టర్ డబ్బులు వసూలు?
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు గట్టుదుద్దెనపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో ఒకే విధంగా కొనసాగుతున్న పనులు, ఈ గ్రామానికి వచ్చేసరికి మారిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పనుల్లో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. రహదారి పక్కన నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీలలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో నాలుగు అడుగుల వెడల్పుతో డ్రైనేజీలు నిర్మిస్తుండగా, గట్టుదుద్దెనపల్లిలో మాత్రం రెండు అడుగులకే పరిమితం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాకాలంలో నీరు నిలిచి ఇళ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణం సరైన ప్రమాణాలతో లేకపోవడం వల్ల గ్రామంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తక్కువ వెడల్పుతో పనులు చేయడం వల్ల నీటి పారుదల సరిగా జరగదని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో రోడ్డు నష్టపోవడానికీ దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.
కాంట్రిబ్యూషన్ పేరుతో దందా?
హైవే పనులు నిర్వహిస్తున్న డీబీఎల్ కంపెనీ సిబ్బందిపై కూడా గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ పేరుతో కొందరి నుంచి డబ్బులు వసూలు చేసి, వారి ఇళ్ల వద్ద పనుల్లో మినహాయింపులు ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా పనులు చేస్తూ, ఇవ్వని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. దీంతో కొన్ని ఇళ్ల వద్ద కరెంట్ తీగలు రహదారి వైపు వాలిపోయి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అధికారులు పనులను కచ్చితంగా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శిస్తున్నారు. గట్టుదుద్దెనపల్లిలో హైవే పనులు నాణ్యత, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పనులను ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని, అక్రమాలపై స


