కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప
కాకతీయ, ఖిలావరంగల్: కాపు న్యాయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా కరిమాబాద్ కు చెందిన స్వరూప ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా రాజేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ
రాష్ట్రంలోను దేశంలోను మహిళా నాయకత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుదాని తెలిపారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర (మోడీ ) ప్రభుత్వం నియోజక వర్గాలు పెంచబోతున్నారని అన్నారు. మహిళా జనాభా లెక్కల ప్రకారం మహిళలకు 50% టికెట్లు కేటాయించి పార్లమెంట్ లో మహిళల ఆత్మగౌరవం పెంచేవిధంగా ముందడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో పెరుగనున్న 816 పార్లమెంట్ సీట్లలో 273 మంది మహిళా ఎంపీలు పార్లమెంటులో అడుగు పెట్టనున్నారని ఉమా రాజేందర్ వెల్లడించారు. అందుకు తగినట్లుగా మహిళలను రాజకీయంగా చైతన్యం చేయడంలో మహిళలు ముందుండాలని ఉమా రాజేందర్ కోరారు దానిలోభాగంగానే చట్ట సభలకు మహిళలు వెళ్ళేవిధంగా కృషిచేయాలని కోరారు.


