123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదుల మేరకు నగరపాలక సంస్థ కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కోతుల పట్టివేత కార్యక్రమం నిర్వహించారు.
వెటర్నరీ అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక ఏజెన్సీ సిబ్బంది భగత్‌నగర్, సదాశివపల్లి, అలుగునూరు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 123 కోతులను పట్టుకుని సమీప అటవీ ప్రాంతాలకు తరలించారు.
నగరంలో కోతుల సమస్యను దశలవారీగా తగ్గించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.


