శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఆరేగూడెం గ్రామానికి చెందిన ఆరె కులస్తులు హిందూ ధర్మ రక్షకుడు,స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.బుధవారం సర్పంచ్ బలకారి యాకయ్య సారథ్యంలో గ్రామంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆరె కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ఆరె కుల అధ్యక్షుడు దేవరాజు మాట్లాడుతూ…శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు,ఆయన ఆశయాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.భావి తరాలకు ఆయన కీర్తిని చాటిచెప్పేందుకే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు.గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుపై స్థానిక యువత,హిందూ ధర్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో వడికిల లక్ష్మయ్య,వీరయ్య,అనిల్,మహేందర్,రవీందర్,రాజేశ్వర్ రావు,పంచాయతీ కార్యదర్శి ఒడ్డెపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.


