epaper
Wednesday, March 25, 2026
epaper

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి

జగిత్యాల రాజకీయాల్లో సంచలనం

కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.పార్టీకి దశాబ్దాలుగా కట్టుబడి పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అభిమానులు, అనుచరులు, స్థానిక నాయకుల సమక్షంలో చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పార్టీతో అనుబంధం, కార్యకర్తల మద్దతు ఈ మూడు అంశాల మధ్యనే తన నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. సభలో మాట్లాడుతూనే పలుమార్లు భావోద్వేగానికి లోనైన ఆయన “నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను… కానీ నాకు దక్కింది అవమానమే” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ ప్రస్తుత దిశపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఈ చర్యల వల్ల కష్టపడి పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తుచేశారు.జగిత్యాల రాజకీయ పరిణామాలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పక్కనబెట్టి జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం బాధాకరమని దీంతో స్థానిక నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. “నాతో నడిచిన కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయాను” అంటూ బాధ వ్యక్తం చేశారు.

రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం ఆ విలువలు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్లయ్యాయి.ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వంతో సమన్వయం వేరు… కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.పార్టీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు.తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోపించారు.”ఓపికకు కూడా హద్దు ఉంటుంది… గత 20 నెలలుగా ఎన్నో అవమానాలను భరిస్తూ వచ్చాను” అంటూ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు.చివరగా, “గౌరవం లేని చోట ఎలా పని చేయగలం?” అని ప్రశ్నిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయితే పార్టీని వీడినా ఇందిరా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ప్రజా సేవలో కొనసాగుతానని స్పష్టం చేశారు.జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో గంభీర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లే అవకాశముండగా ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి...

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ...

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మున్సిపల్ ఛైర్మన్...

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్

గ్యాస్ సరఫరాలో అక్రమాలకు చెక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img