epaper
Wednesday, March 25, 2026
epaper

పవర్ పేరుతో దోపిడి..!

పవర్ పేరుతో దోపిడి..!
ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం
నార్మల్ లేదంటూ బ‌ల‌వంతంగా పవర్ పెట్రోల్ అమ్మ‌కాలు
లీటర్‌కు రూ.10 అదనపు భారం.. అన్ని బంకుల్లో ఒకే తంతు
వాహనదారులపై ఆర్థిక భారం.. పర్యవేక్షణలో పౌరసరఫరాల శాఖ వైఫల్యం
తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో పెట్రోల్ బంకుల దందా బహిర్గతమవుతోంది. నార్మల్ పెట్రోల్ లేదని చెప్పి పవర్ పెట్రోల్‌ను బలవంతంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ పరిస్థితులను సాకుగా చూపుతూ పెట్రోల్ బంక్ యజమానులు సిండికేట్‌గా మారి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని అనేక బంకుల్లో నార్మల్ పెట్రోల్ అందుబాటులో లేదని చెప్పి, పవర్ పెట్రోల్ మాత్రమే ఉందని వాహనదారులకు తెలియజేస్తున్నారు. దీంతో వినియోగదారులు వెనుదిరగలేని పరిస్థితుల్లో అధిక ధరతో పవర్ పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. లీటర్‌కు సుమారు రూ.10 వరకు అదనంగా చెల్లించాల్సి రావడం సామాన్య ప్రజలపై భారం పెంచుతోంది.

అన్ని బంకుల్లో ఒకే విధానం

ఒకటి రెండు బంకుల్లో మాత్రమే కాదు, నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పాండురంగపురం ప్రాంతంలోని హెచ్‌పీ, భారత్ బంకుల్లో కూడా ఇదే విధంగా పవర్ పెట్రోల్ విక్రయం జరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, బంక్ యజమానుల మధ్య అవగాహనతోనే ఈ విధానం అమలవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్ పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటమే కాకుండా, కొన్ని సందర్భాల్లో మైలేజ్ కూడా తగ్గుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా పవర్ పెట్రోల్ పోయించుకోవాల్సి రావడం వల్ల రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నార్మల్ పెట్రోల్ సరఫరా లోపం కంటే, ఉద్దేశపూర్వకంగా స్టాక్ లేకుండా చేసి పవర్ పెట్రోల్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా దిగుమతులు చేయకపోవడం కూడా దీనికి కారణమని భావిస్తున్నారు.

పర్యవేక్షణలో విఫలమైన యంత్రాంగం

ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నగరంలోని అన్ని బంకుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు జరిగినా అవి కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్టాక్ రికార్డులు మాత్రమే చూసి వాస్తవ పరిస్థితిని పట్టించుకోకపోవడం వల్ల ఈ దందా కొనసాగుతోందని అంటున్నారు. అన్ని బంకుల్లో ఒకే విధంగా నార్మల్ పెట్రోల్ లేకపోవడం, పవర్ పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండటం వెనుక సిండికేట్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు బంక్ యజమానులు పరస్పరం అంగీకరించి ఈ విధానం అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తక్షణ చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత పరిస్థితులపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి, నార్మల్ పెట్రోల్ స్టాక్ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దోపిడీకి పాల్పడుతున్న బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం నగరంలో పెట్రోల్ విక్రయాల పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారం వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం ఖ‌మ్మం జిల్లా కలెక్టర్...

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌ భారీ యంత్రాలతో...

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి భ‌ద్రాచ‌లం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి ఐదు గ్రామ...

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఖ‌మ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img