లక్ష కనకాంబరాలతో భద్రకాళికి పుష్పార్చన
కాకతీయ, వరంగల్ సిటీ : శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజు సందర్భంగా అమ్మవారికి లక్ష కనకాంబర పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. నిత్యాహ్నికం జరిపారు. అనంతరం కల్పోక్త విధానంలో జపహోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. లక్షపుష్పార్చన చేసి నివేదనలు సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్, కృష్ణవేణి దంపతులు పాల్గొన్నారు. సేవలను నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.


