సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయాలి..
*జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
కాకతీయ,గీసుగొండ:సేంద్రీయ విధానంలో కూరగాయల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రైతులకు సూచించారు.మండలంలోని కొనాయిమాకుల రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులకు 100 శాతం రాయితీపై ఉచితంగా ఐదు రకాల కూరగాయల మినీ కిట్స్‌ను పంపిణీ చేశారు.ఈ కిట్లలో టమాటా,పచ్చి మిరప, బెండ, తోటకూర,పాలకూర విత్తనాలు అందజేశారు.అనంతరం రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న బీన్స్,బోడ కాకర, బ్రకోలీ, పొట్లకాయ వంటి తీగజాతి కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు.రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా వెటర్నరీ అధికారి బాలకృష్ణ, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, మండల ఉద్యాన శాఖ అధికారి తిరుపతి,మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మండల ఉద్యాన విస్తరణ అధికారి వేణు, సర్పంచ్ వజ్ర రాజు,ఉప సర్పంచ్ రాజేశ్వరరావు,రైతులు రహీం, పోలీస్ శంకర్ రావు,కాందారి రాజు, విజయ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


