epaper
Wednesday, March 25, 2026
epaper

నా నిర్ణ‌యంలో మార్పు లేదు

చివరి బుజ్జగింపులూ విఫలం
జీవ‌న్‌రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ ఫలితం శూన్యం
పార్టీకి గుడ్‌బై చెప్ప‌డానికే క‌ట్ట‌బ‌డిన మాజీమంత్రి
అవమానాల‌ను ఎదుర్కొంటూ పార్టీలో కొన‌సాగ‌లేన‌ని స్ప‌ష్టం
జ‌గిత్యాల‌లో రేపు అనుచ‌రుల‌తో క‌లిసి స‌భ నిర్వ‌హ‌ణ‌
పార్టీలో అత్యంత సీనియ‌ర్ బ‌య‌ట‌కు వెళ్తుండ‌టంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో చ‌ర్చ‌
తెలంగాణలో కొత్త‌ రాజకీయ స‌మీక‌ర‌ణాల‌కు పునాదంటూ విశ్లేష‌ణ‌లు

కాకతీయ, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : పార్టీలో వరుస అవమానాలు ఎదురవుతున్నాయని, ఇక కొనసాగడం సాధ్యం కాదని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. చివరి వరకూ సాగిన బుజ్జగింపులు విఫలమవడంతో తన నిర్ణయంపై ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల కేంద్రంగా భారీ రాజకీయ దెబ్బగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీ రాజకీయంగా కీలకంగా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి ఆయనను కలిశారు. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు సాగాయి. పార్టీలో కొనసాగాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నాయకులు విన్నవించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు సేవలందించిన సీనియర్ నేత అని గుర్తు చేశారు. తనకు 1986 నుంచే ఆయనతో అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు సహజమని, అలాంటి సమయంలో పార్టీని వీడటం సరైంది కాదని సూచించారు. ఏఐసీసీ నాయకత్వం కూడా జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగాలని కోరుతోందని చెప్పారు. అయితే ఈ బుజ్జగింపులన్నింటినీ జీవన్ రెడ్డి తోసిపుచ్చినట్లు స్పష్టమైంది. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, నిర్ణయాల్లో తనను పక్కనపెడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో కొనసాగడం కంటే బయటకు రావడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

ప్లెక్సీ తొలగింపు.. రాజకీయ సంకేతం

భేటీ అనంతరం జీవన్ రెడ్డి నివాసంపై ఉన్న కాంగ్రెస్ ప్లెక్సీని అభిమానులు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ సంఘటన కాదు. స్థానిక స్థాయిలోనే కాదు, రాష్ట్రస్థాయిలో కూడా ఈ చర్యకు ప్రత్యేక అర్థం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కేడర్ మద్దతు ఉన్నదనే సంకేతం ఇది. జీవన్ రెడ్డి అసంతృప్తి ఒక్కరోజులో ఏర్పడింది కాదు. గత కొంతకాలంగా పార్టీ లోపలి పరిణామాలు, కొత్త నాయకులకు పెరుగుతున్న ప్రాధాన్యం, స్థానిక రాజకీయ సమీకరణాలు ఆయనను అసహనానికి గురిచేశాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన అనుభవానికి తగ్గ గౌరవం దక్కలేదనే భావన బలంగా ఏర్పడినట్లు సమాచారం. ఇది వ్యక్తిగత అసంతృప్తిని రాజకీయ నిర్ణయంగా మార్చిందని చెప్పవచ్చు.

రేపే కీలక ప్రకటన

మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి సమస్య పరిష్కారం కాని దశకు చేరుకుందని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉండి స్వపక్షంతో యుద్ధం చేయడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ పయనాన్ని ప్రకటిస్తానని తెలిపారు. తన నిర్ణయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తున్నానని చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగిత్యాలలో బండారు గార్డెన్స్‌లో జరగనున్న ఈ సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేదికపైనే రాజీనామా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు స్థానికంగా పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర పార్టీలకు ఇది అవకాశంగా మారవచ్చు. ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏదన్నదానిపై ఆధారపడి రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన చివరి ప్రయత్నాలు విఫలమవడంతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే పరిస్థితి స్పష్టమవుతోంది. జీవన్ రెడ్డి నిర్ణయం కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారుతోంది.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి...

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం

కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ...

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం

జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి మున్సిపల్ ఛైర్మన్...

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు

నాలుగు దశాబ్దాల అనుబంధానికి ముగింపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డి జగిత్యాల రాజకీయాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img