epaper
Wednesday, March 25, 2026
epaper

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు

ఇసుక దందాకు అడ్డాగా బూర్గంపాడు
భారీ వాహనాలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక‌
భారీ యంత్రాలతో వాగులో తవ్వకాలు
మోతాదుకు మించి లోడింగ్‌తో రోడ్ల ధ్వంసం
రైతుల పంటలకు తీవ్ర నష్టం
అనుమానాలకు తావిస్తున్న అధికారుల మౌనం

కాకతీయ, బూర్గంపాడు : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండ‌లంలోని కిన్నెరసాని వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు అక్రమార్కులు భారీ మిషనరీల సహాయంతో వాగులో ఇసుకను తవ్వి పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్విన ఇసుకను అతి భారీ వాహనాల్లో మోతాదుకు మించి లోడ్ చేసి ఆంధ్ర, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు తరలిస్తున్నారు. రవాణా రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం స్థానిక ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే అధిక లోడింగ్‌తో భారీ వాహనాలు వెళ్లినా ఎవరూ ఆపకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ అక్రమ రవాణా వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే పలు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజా రవాణా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రయాణాలు కూడా కష్టసాధ్యమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ ముందు నుంచే రవాణా

ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ ఇసుక రవాణా మార్గం స్థానిక పోలీస్ స్టేషన్ ముందుగా ఉండటం. ప్రతిరోజూ ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వస్తున్నప్పటికీ ఈ అక్రమ దందాపై చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగొచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక ర్యాంప్‌కు అనుమతులు ఇచ్చింది ఎవరు, ఈ అక్రమ దందా వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నదుల్లో తవ్వాల్సిన ఇసుకను వాగుల్లో తవ్వడం పర్యావరణానికి ముప్పుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. వాగుల్లో అనియంత్రితంగా తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక కిన్నెరసాని వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఇసుక రవాణా వల్ల ఎగిసే దుమ్ము పంటలపై పడుతూ దిగుబడులను ప్రభావితం చేస్తోందని వారు చెబుతున్నారు. పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయనే భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇసుక దందాను అడ్డుకోకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

పవర్ పేరుతో దోపిడి..!

పవర్ పేరుతో దోపిడి..! ఖమ్మంలో పెట్రోల్ బంకుల సిండికేట్ బహిర్గతం నార్మల్ లేదంటూ బ‌ల‌వంతంగా...

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం అవసరం ఖ‌మ్మం జిల్లా కలెక్టర్...

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి

రాకకు ముందే హామీలు నెర‌వేర్చాలి భ‌ద్రాచ‌లం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకోండి ఐదు గ్రామ...

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి

పరీక్షలు ప్రశాంతంగా జరగాలి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేదు జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఖ‌మ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img