బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్
కాకతీయ, శంకరపట్నం : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అంతడుపుల నరేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన అంతడుపుల నరేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిశారు. వారికి ఓదార్పు తెలిపారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. 50 కిలోల బియ్యం, రూ.10,000 నగదును ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ పాల్గొన్నారు. ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు గొట్టే మధు హాజరయ్యారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


