భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి
కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు
కాకతీయ, ఏటూరునాగారం : భగత్ సింగ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి చిటమట రఘు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “దేశ స్వాతంత్ర్యం కోసం యువజీవితాలను త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల స్ఫూర్తిని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టుకోవాలి” అని చిటమట రఘు అన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. వారి త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారి ధైర్యసాహసాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో ఉన్న అన్యాయాలు, రుగ్మతలు, సమస్యలపై పోరాడే ధైర్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి ఆయుబ్ ఖాన్, స్టేట్ ఆర్టిఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు గంపల శివకుమార్, శాపల్లీ గ్రామ కమిటి అధ్యక్షుడు కుక్కల రామయ్య తదితరులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు హాజరయ్యారు.


