కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్
డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. “కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి పేల్చివేస్తాం” అంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరిక పంపారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది మెయిల్‌ను గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. కోర్టు గదులు, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కచ్చిదారులు భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.


