బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో అంగడి ప్రారంభం
సంత ఏర్పాటు చెయ్యడం అభినందనీయం
నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో వారాంతపు అంగడి ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ ఎస్సై చిర్ర రమేష్ బాబులు అన్నారు. ముఖ్యఅతిథిగా ఎస్సై చిర్ర రమేష్ బాబు పాల్గొని ఆదివారం అంగడిని ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్తపల్ల గ్రామంలో ప్రతి ఆదివారం అంగడి నిర్వహించడం గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామస్తులు దూర ప్రాంతాలకు వెళ్లి కూరగాయలు వివిధ రకాల సరుకులను కొనుగోలు చేసేందుకు వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడేదని మరియు అధిక ఖర్చు కూడా అయ్యేదని అన్నారు. ఇప్పుడు అలాంటి బాధ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులను కొనుగోలు చేసేందుకు ఈ గ్రామంలో ప్రారంభించామని అన్నారు. ఈ సంతాలో అన్ని రకాల సరుకులు దొరుకుతాయని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు ఈ గ్రామంలో ఈ సంతా ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహేశ్వరి, స్వరూప, పరశురాములు, అనంతలక్ష్మి, మునేష్, సరిత, మురళి, ఎల్లమ్మ, ఎన్జీఎఫ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


